సుదీర్ఘ లాక్ డౌన్ మంచిది కాదని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా వ్యాప్తి మరింత తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తి వేత విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. దేశంలో రెడ్, ఆరెంజ్, జోన్లుగా గుర్తించిన ప్రాంతాలలో లాక్ డౌన్ కొనసాగిస్తూనే గ్రీన్ జోన్లలో నిబంధనలతో ఎత్తివేసే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తున్నది.
దేశ వ్యాప్తంగా చూసుకుంటే పట్టణాలు, నగరాల కంటే గ్రామీణ ప్రాంతాలలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంది. అ ప్రాంతాలలో ప్రజల జీవనోపాధి వ్యవసాయం కావడంతో ముందుగా గ్రామీణ ప్రాంతాలలో సామాజిక దూరం పాటించాలన్న నిబంధనతో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ముగిసే సమయం సమీపిస్తున్న కొద్దీ.. కేంద్రం లాక్ డౌన్‌ను ఉపసంహరించకుంటుందా అనేది తెలియాల్సివుంది.