Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీలిన జననాంగం... తొడలు, ముంజేతులను రక్కి... చిన్నారి పోస్ట్‌మార్టం రిపోర్టు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ళ చిన్నారిని ఎనిమిది రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన కేసులో తాజాగా పోస్ట్‌మార్టం నివేదిక వెలుగుజూసింది. ఈ రిపోర్టు చదివితే కన్న

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (18:39 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ళ చిన్నారిని ఎనిమిది రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన కేసులో తాజాగా పోస్ట్‌మార్టం నివేదిక వెలుగుజూసింది. ఈ రిపోర్టు చదివితే కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ నివేదికను ఇండియా టుడే బయటపెట్టింది.
 
మైనర్ బాలికను మానవ మృగాలు ఎంత కర్కశంగా హింసించారో ఆమె మృతదేహంపై గాయాలు చూస్తేనే ఇట్టే తెలుసుకోవచ్చు. బాధిత బాలిక జననాంగం వద్ద బలంగా చీలిన గాయాలున్నాయనీ... జననాంగం ఛిద్రమై తీవ్ర రక్తస్రావం జరిగిందని పోస్టు మార్టం నివేదిక వెల్లడించింది. 
 
ఉదరభాగం చుట్టూ నీలిరంగులోకి మారడంతో పాటు తొడలు, ముంజేతులపై రక్కిన గుర్తులున్నాయని పేర్కొంది. కుడివైపు చెవి వెనుక బలమైన గాయం ఉందనీ.. నాలుక బయటికి వచ్చి కనిపిస్తోందని పోస్టుమార్టంలో పేర్కొన్నారు. 
 
కాగా ఇంకా ఏయే విషయాలు గుర్తించారో మరిన్ని వివరాలు ఇవ్వాలంటూ జమ్మూ కశ్మీర్ పోలీసులు మెడికల్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఇతర విషయాలతో పాటు బాధితురాలి నడుము కింది భాగమంతా బలమైన గాయాలున్నాయని, లైంగిక దాడి వల్లే ఇలా జరిగిందంటూ మెడికల్ బోర్డు నిర్ధారించి నివేదికను ముగించింది.
 
ఇదిలావుండగా, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ మరోసారి నోటికి పనిచెప్పారు. కఠువా రేప్ కేసు ద్వారా హిందువులను అప్రదిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజకీయ గేమ్ ప్లాన్‌లో భాగంగానే ఈ కేసుపై రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం