Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లిని తన భర్తకిచ్చి పెళ్లి చేసిన భార్య.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (17:29 IST)
తమ గుట్టురట్టు బహిర్గతంకారాదని, తనభర్తను పోలీసుల నుంచి రక్షించాలని భావించిన ఓ ఇల్లాలు.. తన చెల్లిని కట్టుకున్న భర్తకు ఇచ్చి రహస్యంగా పెళ్లి చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పట్టణానికి సమీపంలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హునసికోట్‌లో ఉంటున్న 32 ఏళ్ల గంగరాజు పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కొద్ద నెలల క్రితం కోలార్ జిల్లా మలూర్ ప్రాంతానికి చెందిన పల్లవి అనే మహిళతో అతనికి వివాహం జరిగింది. కాపురానికి వెళ్లే సమయంలో పల్లవి తన 13 ఏళ్ల చెల్లెలిని వెంటతీసుకుని వచ్చింది. ఇంటి పనుల్లో సహాయపడుతుందని, తనను బాగా చదివిస్తానని చెప్పి బాలికను తీసుకువెళ్లింది. 
 
కానీ భర్త ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అక్కను వదిలేస్తానని బెదిరించాడు. బాలిక భయపడి ఎవరికీ విషయం చెప్పలేదు. ఇంటికి వచ్చిన అక్క తీవ్ర రక్తస్రావం అవుతున్న చెల్లెలిని చూసి ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు నిజం చెప్పారు. 
 
భర్త గుట్టురట్టు చేయకూడదనే ఉద్దేశంతో ఎవరికీ తెలియకుండా చెల్లెలిని భర్తకిచ్చి కట్టబెట్టింది. విషయం స్థానికులకు తెలియడంతో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కి సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి బాలికను ప్రశ్నించారు. చిన్నారి పోలీసులతో అసలు విషయం చెప్పింది. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గంగరాజును, పల్లవిని అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments