Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకప్.. వెంటపడ్డాడు.. అత్యాచారం చేశాడు.. చేయించాడు.. చివరికి కిరోసిన్ పోసి?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (17:15 IST)
కొంతకాలం చట్టాపట్టాలేసుకుని తిరిగిన ప్రేమికుల మధ్య లవ్ బ్రేక్ అప్ అయింది. కానీ ఆమెను మరిచిపోలేని ప్రియుడు ఆమె వెంటపడ్డాడు. పెళ్లి చేసుకోమని కత్తితో బెదిరించాడు. ఒప్పుకోకపోవడంతో అత్యాచారానికి ఒడిగట్టాడు. తన స్నేహితుడితో కూడా అత్యాచారం చేయించాడు. ఆ తర్వాత కిరోసిన్ పోసి కాల్చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
ఢిల్లీలోని ఆర్‌కే పురం ఏరియాకు చెందిన 18 ఏళ్ల అజిత్ రేగి మ్యాథ్యూ కుంబానంద్ ఏరియాకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయిరోర్ ఏరియాలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న ఆ అమ్మాయి కూడా మ్యాథ్యూని ప్రేమించింది. ఇద్దరూ కలిసి కొన్నాళ్లు పార్క్‌లకు, సినిమాలకు తిరిగారు. మద్యానికి బానిసైన మ్యాథ్యూని చూసి ఆమె అసహ్యించుకుంది. 
 
కలుసుకోకుండా దూరంపెట్టింది. కొన్నాళ్ల క్రితం లవ్‌కి కూడా గుడ్‌బై చెప్పింది. కానీ ఆమెని మరిచిపోలేని ప్రియుడు వెంటపడి వేధించాడు. కానీ ఆ అమ్మాయి పట్టించుకోలేదు. సోమవారం మ్యాథ్యూ, అతని స్నేహితుడు అఫ్తబ్ ఖాన్ కలిసి అమ్మాయి చదువుకుంటున్న కళాశాలకు వెళ్లారు. ప్రియురాలు కనిపించగానే దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోమని అడిగాడు, ససేమిరా కాదనడంతో మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. 
 
కానీ లొంగకపోవడంతో అత్యాచారానికి ఒడిగట్టాడు. తాను మాత్రమే కాకుండా స్నేహితుడితో కూడా అత్యాచారం చేయించాడు. ఇద్దరూ కలిసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటలలో చిక్కుకున్న ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
 
మంటలు ఆర్పి 60 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అఘాయిత్యానికి పాల్పడిన మ్యాథ్యూని, అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments