Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.2 వేల రూపాయల నోటు కోసం రైలు పట్టాలపైకి దూకేసింది.. ఏమైందంటే?

Advertiesment
రూ.2 వేల రూపాయల నోటు కోసం రైలు పట్టాలపైకి దూకేసింది.. ఏమైందంటే?
, బుధవారం, 13 మార్చి 2019 (15:43 IST)
రూ.2 వేల కోసం ఓ మహిళ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మెట్రో పట్టాలపైకి దూకేసింది. ఈ సంఘటన ఢిల్లీలోని ద్వారకామోర్ మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన జకారిచ్ కోశాయ్ అనే మహిళ ద్వారకామోర్ స్టేషన్‌కు చేరుకుంది. ఆమె వద్దనున్న రూ.2 వేల నోటు మెట్రో పట్టాలపై పడిపోయింది. దీంతో ఆ నోటును తీసుకునేందుకు మహిళ పట్టాలపైకి దూకింది. 
 
అంతలోనే పట్టాలపైకి మెట్రో రైలు రావడంతో అక్కడ ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ఆమె ట్రాక్ మధ్యలో ఉండిపోవడం వల్ల స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. కొన్ని బోగీలు ఆమెపై నుంచి వెళ్లాయి. ఆ తర్వాత జకారిచ్‌ను సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో సేవలకు అంతరాయం కలిగించినందుకు గానూ క్షమాపణలు కోరుతూ లేఖ రాయించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా లోకేష్ పోటీచేసే లొకేషన్‌పై క్లారిటీ.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ