Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రధానికి భారీ జరిమానా : షాకిచ్చిన బెంగుళూరు కోర్టు

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (18:11 IST)
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడకు బెంగుళూరు కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఎప్పుడో పదేళ్ల క్రితం దేవెగౌడ చేసిన వ్యాఖ్యలకు పరువునష్టం దావా చెల్లించాలని బెంగళూరులోని ఎనిమిదో సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది.
 
తాజాగా వెలువడిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, బీదర్ సౌత్ మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనీ మేనేజింగ్ డైరెక్టర్‌‍గా వ్యవహరిస్తున్న నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ (నైస్) సంస్థ గురించి దేవెగౌడ విమర్శించారు. 
 
నైస్ ఒక దోపిడీ ప్రాజెక్టు అని వ్యాఖ్యానించారు. 2011 జూన్ నెలలో ఓ ఇంటర్వ్యూలో ఆయన సదరు సంస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. 'గౌడర గర్జనే' పేరుతో ఓ వార్తా ఛానల్ ఆ ఇంటర్వ్యూని ప్రసారం చేసింది.
 
ఈ వ్యాఖ్యలపై సదరు సంస్థలో పరువు నష్టం దావా వేసింది. దేవెగౌడ వ్యాఖ్యల వల్ల తమ సంస్థ పరువు నష్టం జరిగిందని కోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థాయం మంగళవారం తీర్పును వెలువరించింది. 
 
నైస్ సంస్థకు నష్ట పరిహారంగా రూ.2 కోట్లను చెల్లించాలని దేవెగౌడను ఆదేశించింది. పరువు నష్టం కలిగించే ఇలాంటి వ్యాఖ్యలను అనుమతించలేమని... వీటిని అనుమతిస్తే, భవిష్యత్తులో ఇలాంటి భారీ ప్రాజెక్టును అమలు చేయడం కష్టమవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇపుడు ఏం చేయాలో దేవెగౌడకు దిక్కుతోచడం లేదు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments