Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక ఎన్నికల పోలింగ్.. ఓటేయండి.. వేడి వేడి దోసె, కాఫీ కొట్టండి..

కర్ణాటక ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఎండల కారణంగా పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున క

Webdunia
శనివారం, 12 మే 2018 (12:31 IST)
కర్ణాటక ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఎండల కారణంగా పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున క్యూ కట్టారు. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 
 
ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. అవగాహన కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించింది. అయితే ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఓ హోటల్‌ నిర్వహకుడు వినూత్న పద్ధతిలో ముందుకు వచ్చాడు. నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణ రాజ్‌ బెంగళూరులో ఓటింగ్‌ శాతం పెంచేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలెట్టాడు. 
 
కర్ణాటక పోలింగ్‌లో తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్న యువతకు తన హోటల్‌లో ఉచితంగా దోసె అందిస్తున్నాడు. అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఇతరులకు ఫిల్టర్‌ కాఫీని ఇస్తానని ఆఫర్ చేశాడు. ఈ ఉచిత దోసె, కాఫీని పొందాలంటే ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును హోటల్‌లో చూపించాల్సి ఉంటుంది. ఎవరికైనా ఓటేయండి.. కానీ ఓటు హక్కును వినియోగించుకోండని హోటల్ యజమాని కొత్త ప్రచారాన్ని చేపట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం