Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో హంగ్... రేవణ్ణకు బీజేపీ గాలం... 10 మంది ఎమ్మెల్యేలు జంప్...

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారు.

Webdunia
మంగళవారం, 15 మే 2018 (15:30 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇందులోభాగంగా, 40 సీట్లతో మూడో స్థానంలో ఉన్న జేడీఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే బయట నుంచి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించింది.
 
ఇదిలావుంటే, మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త దూరంలో నిలిచిపోయిన బీజేపీ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ఇందులోభాగంగా దేవెగౌడ కుమారుడు రేవణ్ణతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తనతో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమని బీజేపీకి రేవణ్ణ భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే... కన్నడ నాట బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
 
ఇదిలావుండగా, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 104 స్థానాలను దక్కించుకుంది. సాధారణ మెజారిటీకి కాస్త దూరంలో బీజేపీ ఉంది. రెండోస్థానంలో కాంగ్రెస్‌ ఉండగా జేడీఎస్‌ కీలకంగా మారింది. కాగా కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమిగా పీఠం ఎక్కేందుకు రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్ 77 స్థానాల్లో పట్టు నిలుపుకుంటే.. జేడీ(ఎస్) 40 స్థానాల్లో గెలిచింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments