Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#KarnatakaVerdict : బీజేపీకి షాక్... జేడీఎస్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడలేదు. ప్రస్తుతాని వెల్లడైన ఫలితాల మేరకు ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ చకచకా పావుల

Advertiesment
Karnataka Election Result LIVE
, మంగళవారం, 15 మే 2018 (15:10 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడలేదు. ప్రస్తుతాని వెల్లడైన ఫలితాల మేరకు ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదిపింది. ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్‌కు మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రిగా కుమార్ స్వామి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
 
మంగళవారం వెల్లడైన ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల మేరకు... బీజేపీ 96 సీట్లను గెలుచుకోగా, మరో 8 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అలాగే, కాంగ్రెస్ పార్టీ 69 సీట్లను గెలుచుకోగా, మరో 9 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇకపోతే, జేడీఎస్ పార్టీ అభ్యర్థులు 30 చోట్ల గెలుపొందగా, మరో 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. 
 
దీంతో కర్ణాటకలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ప్రణాళిక వేసుకుంటోన్న బీజేపీ ఆశలపై కాంగ్రెస్‌ నీల్లు చల్లింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తమ రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. 'ప్రజల తీర్పే శిరోధార్యం.. జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది' అని వ్యాఖ్యానించారు.
 
జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఇతర కాంగ్రెస్‌ నేతలు కీలక ప్రకటన చేశారు. తాము జేడీఎస్‌ నేతలు దేవేగౌడ, కుమారస్వామితో చర్చలు జరిపామని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని గవర్నర్‌ కోరతామని అన్నారు. జేడీఎస్‌ నుంచి ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించాలి.. గాజాలో ఘర్షణ.. 40మంది మృతి