Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#KarnatakaElectionResults2018 : సర్వే ఫలితాలన్నీ తలకిందులయ్యాయి..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాలన్నీ తలకిందులయ్యాయి. ఈ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ అంటూ ఊదరగొట్టేలా మెజారిటీ పోల్ సర్వేలు కుండబద్ధలు కొట్టాయి.

#KarnatakaElectionResults2018 : సర్వే ఫలితాలన్నీ తలకిందులయ్యాయి..
, మంగళవారం, 15 మే 2018 (10:58 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాలన్నీ తలకిందులయ్యాయి. ఈ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ అంటూ ఊదరగొట్టేలా మెజారిటీ పోల్ సర్వేలు కుండబద్ధలు కొట్టాయి. కానీ, కన్నడ ఓటరు మాత్రం విస్పష్ట తీర్పును వెలువరించాయి.
 
ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదనే బలమైన అంచనాలను బీజేపీ తిరగరాస్తూ... మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. దీంతో సీన్ మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10.20 గంటల ప్రాంతానికి 120కు పైగా సీట్లలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 59, జేడీఎస్‌కు 41, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 
 
అయితే, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుంటే మూడో స్థానంలో కొనసాగుతున్న జేడీఎస్‌కు 'కింగ్ మేకర్' హోదా దగ్గేది. అలా జరిగితే అది జేడీఎస్‌కూ కలిసొచ్చే అంశమే. తాము మద్దతిచ్చే పార్టీతోనే అధికారం పంచుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో బీజేపీ 120 సీట్ల అధిక్యాన్ని దాటేసింది. 
 
బీజేపీ సీనియర్ నేత సదానంద గౌడ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. తమ పార్టీ ఇప్పటికే 112 స్థానాలు దాటేసిందని, సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  స్పష్టమైన ఆధిక్యత వస్తే జేడీఎస్‌తో పొత్తు అవసరమే లేదని అన్నారు. మరోవైపు కర్ణాటకలో పాగా వేశామంటూ బీజేపీ కార్యకర్తలు సంబరాలు కూడా మొదలుపెట్టేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#KarnatakaVerdict : ఓటమి దిశగా నటుడు సాయికుమార్