#KarnatakaElectionResults2018 : కాంగ్రెస్ "ముక్త్ భారత్" తథ్యమా?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన "కాంగ్రెస్ ముక్త్ భారత్" పిలుపు సార్ధకమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో అధికారంలో కోల్పోతూ వస్తోంది. అదేసమయంలో భారతీయ జనతా పార్టీ ఒక్కో
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన "కాంగ్రెస్ ముక్త్ భారత్" పిలుపు సార్ధకమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో అధికారంలో కోల్పోతూ వస్తోంది. అదేసమయంలో భారతీయ జనతా పార్టీ ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ వస్తోంది. ఫలితంగా బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య 21కు చేరగా, కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. ఇతరులు మరో ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు.
ప్రస్తుతం దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే వాటిలో బీజేపీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ (ఎన్డీయే), గోవా, కర్ణాటక రాష్ట్రాలు బీజేపీ ఖాతాలో చేరిపోయాయి.
ఇకపోతే, కాంగ్రెస్ ఖాతాలో పంజాబ్, మిజోరం రాష్ట్రాలు మాత్రమే ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడులో అన్నాడీఎంకే, కేరళలో సీపీఎం (లెఫ్ట్), వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఒడిషాలో బిజూ జనతాదళ్ పార్టీలు ఉన్నాయి.