Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించాలి.. గాజాలో ఘర్షణ.. 40మంది మృతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించాలని వివాదస్పద ప్రకటన చేశారు. అంతేగాకుండా.. జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించడం అనేది.. తమ వద్ద దీర్ఘకాలికంగా పెండింగ్‌ల

జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించాలి.. గాజాలో ఘర్షణ.. 40మంది మృతి
, మంగళవారం, 15 మే 2018 (14:57 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించాలని వివాదస్పద ప్రకటన చేశారు. అంతేగాకుండా.. జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించడం అనేది.. తమ వద్ద దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న అంశమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా  జెరూసలెంకు అమెరికా తన ఎంబసీని తరలిస్తోంది. కానీ ఈ చర్యకు వ్యతిరేకంగా గాజా సరిహద్దులో ఆందోళనలు మిన్నంటాయి. 
 
సరిహద్దు కంచెను తొలగించేందుకు పాలస్తీనీయులు ప్రయత్నించడంతో ఆందోళన కారులపై ఇజ్రాయెల్‌ సైన్యం భీకరంగా కాల్పులు జరిపింది. దీంతో సుమారు 40మంది నిరసన కారులు అక్కడికక్కడే మరణించారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ట్రంప్‌ చర్య మధ్యప్రాచ్యంలో మరో తేనెతుట్టను కదిలించినట్టు ఉందని విశ్లేషకులు అంటున్నారు.          
 
కాగా, 1967లో జరిగిన యుద్ధం తరువాత తూర్పు జెరూసలెంను జోర్డాన్‌ దేశం నుంచి ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకుంది. అనంతరం అవిభాజ్య జెరూసలెంను ఇజ్రాయెల్ తమ రాజధానిగా భావిస్తూ వస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు జెరూసలెంను ఆ దేశ రాజధానిగా గుర్తించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలో సంచలనం... జేడీఎస్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్... సీఎంగా కుమారస్వామి?