Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడు కాపీ కొట్టండి చూద్దాం.. తలకు బాక్సులు తగిలించారుగా!

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (16:27 IST)
పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యమే. విద్యార్థుల్లో మార్పు రావట్లేదు. అంతేగాకుండా కాపీ కోసం వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. దీంతో విసిగిపోయిన కర్ణాటకకు చెందిన ఓ విశ్వ విద్యాలయం అధికారులు వినూత్న రీతిలో కాపీయింగ్‌ను అరికట్టే చర్యలు చేపట్టారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల తలలకు అట్టపెట్టలు తగిలించి పరీక్షలు రాయించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని భగత్ పీయూ కాలేజీలో థర్డ్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. విద్యార్థులు కాపీలు కొట్టేందుకు వీలు కాకుండా వారి ముఖాలకు అట్టపెట్టలు పెట్టించి మరీ పరీక్ష రాయించారు. కళ్ల భాగం వరకే తెరిచి ఉండేలా అట్టె పెట్టలకు రంధ్రాలు పెట్టారు. కానీ ఈ అట్టపెట్టెల వల్ల కొందరు విద్యార్థులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. 
 
దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కాలేజీ యాజమాన్యంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారం కాస్త కర్ణాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎస్. సురేష్ వరకు చేరడంతో కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 'ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని.. విద్యార్థులను జంతువుల మాదిరిగా చూస్తున్నారని సీరియస్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments