జీవితంలో సుఖదుఃఖాలుంటాయి. సుఖసంతోషాలుంటే పొంగిపోవడం, ఈతిబాధలుంటే కుంగిపోవడం మానవ నైజం. సుఖదుఃఖాలను ఒకేలా చూసే మనస్తత్వం లభించాలంటే.. సాయిని స్మరించాల్సిందే అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. భయాలను, దుఃఖాలను తొలిగించే మహిమాన్వితుడు సాయి ఒక్కడే. ఈ సాయిబాబా మంత్రాన్ని పఠించడం ద్వారా కష్టనష్టాలన్నీ తొలగిపోతాయి. సర్వశుభాలు చేకూరుతాయి.
"ఓం సాయి గురువాయే నమః
ఓం షిరిడీ దేవాయే నమః
ఓం సర్వ దేవ రూపాయే నమః'' అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం శుచిగా స్నానమాచరించి.. తొమ్మిది సార్లు పఠించాలి. ఇంకా గురువారాల్లో సాయిబాబా ఆలయానికి వెళ్లి ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
సాయిబాబా ఆలయానికి వెళ్లి స్వామివారికి జీడిపప్పు లేదు కలకండలను నైవేద్యంగా సమర్పించి.. ఈ మంత్రాన్ని 108సార్లు ఉచ్చరించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శత్రుభయం వుండదు. ఈతిబాధలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం దరిచేరవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇంకా ఐదు రోజుల పాటు సాయిబాబాను నిష్ఠగా పూజించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి.
గురువారం నుంచి ప్రారంభించి సోమవారం వరకు ఉదయం, సాయంత్రం పూట సాయిబాబాకు బూందీని నైవేద్యంగా సమర్పించి.. పుష్పాలు, హారతితో పూజించిన వారికి సకలశుభాలు చేకూరుతాయి.