Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శంఖువును స్మశానంలో వుంచితే.. దుర్మరణం చెందిన ఆత్మలు..?

Advertiesment
శంఖువును స్మశానంలో వుంచితే.. దుర్మరణం చెందిన ఆత్మలు..?
, గురువారం, 20 డిశెంబరు 2018 (12:37 IST)
గాయత్రీ దేవి చేతిలో శంఖం వుంటుంది. వరాహి, త్రిపురసుందరి వంటి శక్తి మాతల చేతుల్లో శంఖువు తప్పకుండా వుంటుంది. వీరికి శంఖువులతో మాలను సమర్పించడం చేస్తుంటారు. శంఖువులో మూల మంత్రాన్ని ఆవాహన చేసి.. ఆ నీటిని దేవతలకు అర్చించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. దేవతలకు శంఖువు ప్రీతికరం. అలాంటి పునీతమైన, శుభ్రతకు మారుపేరుగా భావిస్తున్న శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా సుభీక్షం లభిస్తుంది.  
 
తామరపూవు, శంఖువు వుండే ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కుబేర లక్ష్మీ మంత్రంతో శంఖువు పూజ చేసి.. ఆ నీటితో శ్రీ మహాలక్ష్మికి అభిషేకం చేసేవారికి సంపదలు చేకూరుతాయి. వాస్తు ప్రయోగాల్లో మయాన్, విశ్వకర్మల పుస్తకాల్లో శంఖుస్థాపన మహూర్తం అని పేర్కొనబడి వుంది. 
webdunia
 
శంఖువుపై నవధాన్యాలను వుంచి.. ఓ చెక్క పెట్టెలో ఎండ్రకాయలు సంచరించిన మట్టి, చెరువు మట్టి, పుట్ట మట్టి వుంచి.. ఆ పెట్టెను పూజా మందిరంలో వుంచి పూజలు చేస్తే.. అష్టైశ్వర్యానికి ఢోకా వుండదు. అంతేకాకుండా స్మశానాల్లో శంఖువును వుంచితే.. అక్కడున్న దుర్మరణం చెందిన ఆత్మలు తొలగిపోతాయని.. వాస్తు శాస్త్రం చెప్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-12-2018 గురువారం దినఫలాలు - రుణాలు, చేబదుళ్లు తేలికగా...