కొత్త గృహ నిర్మాణాలు ఎక్కువగా చేస్తుంటారు. కానీ, వాస్తు ప్రకారం హెచ్చుతగ్గులు ఎలా అమర్చుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. శాస్త్రం ప్రకారం ఆ దిశలు ఎలా ఉండాలో తెలుసుకుందాం...
1. ఈశాన్యమున గల స్థలం తగ్గినచో సంతాన నష్టం, ధననష్టం కలుగుతుంది. ఉత్తరంతో కలిగి ఈశాన్యం పెరిగిన స్థలంలో నివశించే వారు ధనం ఖర్చు చేయనివారు మాత్రమే.. అనగా పొదుపరులని అర్ధం.
2. ఈశాన్యం తగ్గిన స్థలంలో నివశించే వారిని పరిశీలించి చూడాలి. ఉత్తరంతో కలిగి ఈశాన్యం పెరిగిన స్థలంలో నివశించే వారు స్థిరచరాస్తి వృద్ధిని కలిగి, అధిక భోగభాగ్య సిద్ధిని పొందుతారు.
3. తూర్పుతో కూడిన ఈశాన్యమూల పెరిగిన స్థలంలో నివశించే వారికి గొప్ప కీర్తీ, పుత్త పౌత్రాభివృద్ధి, ఐశ్వర్యం, వంశవృద్ధి సూచితం.
4. ఆగ్నేయమందుగల స్థలం ఎక్కువగా పెరిగినచో ఎన్నో కష్ట నష్టాలు దారిద్ర్యం సంప్రాప్తిస్తాయి. ఆగ్నేయం తగ్గి నైరృతి పెరిగిన స్థలంలో ఉండే వారికి దరిద్ర్యం, చెడు కార్యాల పట్ల ఆసక్తి.
5. నైరృతి భాగమున స్థలం తగ్గినచో గౌరవాదరాలు, సర్వజన వశ్యత, ఆరోగ్యం, సంతానవృద్ధి. నైరృతి కేవలం మూలగా పెరిగినచో శత్రుబాధలు, ఋణ బాధలు, నీచకర్మల పట్ల ఆసక్తి సంభవం. దక్షిణంతో కూడిన నైరృతి పెరిగినచో రోగబాధలు, ప్రాణభయం, అపమృత్యుభయం కల్గును.