పుట్టుమచ్చ అనేది ప్రతిఒక్కరిలో ఉండేది. చాలామందికి పుట్టమచ్చ గురించి అంతగా తెలియదు. అసలు ఎందుకు తెలుసుకోవాలని ఆలోచిస్తుంటారు. శాస్త్రం ప్రకారం స్త్రీలకు పెదవి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే కలిగే ప్రయోజనాలు.. నష్టాలు ఓసారి చూద్దాం..
స్త్రీలకు పై పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నచో.. చాలా మంచిది. సిరిసంపదలతో తులతూగుచుండును. కామబోగములయందు చతురతయు, చాతుర్యముగను మృదుమధురంగా మాట్లాడు వారు, సర్వజనులకు సమ్మతమగురీతిని సంచరించుటయు మొదలగు ఫలితాలు కలుగును.
పై పెదవి లోపలి భాగానా పుట్టుమచ్చ ఉంటే.. ఆ స్త్రీ మంత్ర శాస్త్రములయం, దాసక్తియు, దేవతారాధనయు, సదాస్నానసంధ్యలతో కాలక్షేపం చేయుచుండుటయు మొదలగు ఫలితాలు కలుగును.
క్రింది పెదవి మీ మచ్చ ఉన్నచో అమితముగ భుజించుటయు, తీరనికామమును, సజ్జనసహవాసమును, చతురతగ మాటలాడుటయు, గౌరమముగ జీవించుటయు, మంచివస్తులయందు ప్రీతియు మొదలగు ఫలితాలు కలుగును.
క్రింది పెదవి లోపలి భాగంలో పుట్టమచ్చ ఉన్నచో.. కఠినముగా మాటలాడుటయు, దుష్టసహవాసమును, బంధువిరోధమును, దేవునియందు భక్తి లేకపోవుటయు, కఠినహృదయం, పెద్దల మాటలను తిర్సకరించుటయు మొదలగు ఫలితాలు కలుగును.