Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షిరిడీ సాయిబాబా మహిమాన్వితం..?

షిరిడీ సాయిబాబా మహిమాన్వితం..?
, బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (12:31 IST)
సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. కానీ, సాయిబాబాను ముస్లింలు, హిందువులు సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగం కుదర్చడానికి ప్రయత్నించారు. బాబా మసీదులో నివసించారు. గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. బాబా రెండు సంప్రదాయాల పదాలను, చిత్రాలను ఉపయోగించారు.
 
సాయి ముఖ్యమైన ఒక వాక్యం అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్. చాలామంది భక్తులు సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు. బాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ చాలా ముఖ్యమైనవి. అదైత్వం, భక్తిమార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. 
 
సాయిబాబా ప్రతీ గురువారం రోజున పూజలు చేస్తే మంచిదంటున్నారు. సాయిబాబా పూజించడం వలన సకలదోషాలు, పాపాలు తొలగిపోతాయి. దాంతో పాటు కోరిన కోరికలు తీర్చడంలో బాబా మించినవారెవ్వరు ఉండరు. సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకునే వ్యవస్థ కూడా ఏమీ లేదు. బాబా అందరికీ చెందినవారు. 
 
సాయిబాబా పెక్కు మహిమలు కనబరుస్తాయి. వీటిలో ఎక్కువగా హేమాండ్ పంతు రచించిన సాయి సచ్చరిత్రలో ప్రస్తావించబడ్డాయి. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం, ఖండయోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు, ప్రకృతి శక్తులను నియంత్రించడం, భక్తుల మనసులోని విషయాలు తెలుసుకోవడం, దూర ప్రాంతాలలోని భక్తులకు తన సందేశం తెలియజేయడం వంటి మహిమలు ఎన్నో ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లోని అన్నీ గదులు.. ఒకే కొలతలతో ఉండవచ్చా..?