కొందరి ఇంట్లో భగవద్గీత ఉంటుంది. కానీ, దానిని చదవకుండా అలానే ఉంచేస్తున్నారు. ఇలా చేయడం వలన మంచిదో కాదో తెలుకోవాలంటే.. ఈ కథనం చదవండి.. చాలు. క్షుద్రవాదాలు ఈ దేశంలో అంతటా ఉన్నాయి. అవి నిజమైనతే ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ శాస్త్రాలు, సంప్రదాయాలు బతికి ఉండేవి కావు. దేవుని మాట, భగవద్గీత. అది సకల వేదవిజ్ఞాన సారస్వతం. మనిషి జీవించేది అన్నంతోటి, అధికారంతోటి, ఆస్తుల తోటి అని చాలామంది అనుకుంటారు.
అలా అయితే జంతువులకు కూడా అవన్నీ ఉన్నాయి. మరి మనిషి గొప్ప ఏంటి. మనిషి యొక్క గొప్పతనం మాట అని చెప్తున్నారు. ఇదే మనిషి వైభవం. శబ్దం చేసే, శబ్దం ఇచ్చే శక్తి మహోన్నతమైంది. ఆకాశం అంతరంగం కూడా అదే. శబ్దించే గుణం ఒక్కటే ఉంది. మనిషి మాటతో గెలుస్తాడు, మట్టిలో కలుస్తాడు. భగవద్గీతలో ఉంది విప్లవాత్మకమైన శబ్ద జీవన వైభవం.
అందులో ఉన్నది ప్రపంచంలో లేకపోవచ్చు కానీ ప్రపంచంలో ఏముందో అది గీతలో ఉంటుంది. ఆ గ్రంథాన్ని ఇంట్లో ఉంచుకుంటే దోషం కాదు. దానిని చదవకుంటేనే దోషమంటున్నారు పండితులు. దానిలోకి ప్రయాణించగలిగితే ఇక ఎందులోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.