Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తూర్పు ముఖంగా పూజ గది ఉంటే.. ఏం చేయాలి..?

Advertiesment
puja
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:39 IST)
ఇంట్లోని పూజగది తూర్పు ముఖంగా ఉంటే.. పూజలు ఎలా చేయాలి.. దాదాపు తూర్పు ముఖంగా ఉన్నవే మనదేశంలో దేవాలయాలు. అందులో ఎన్నో ఆలయాలు నాలుగు గంటలకు నైవేద్యార్చనలు పొందుతున్నాయి. పూజ బ్రహ్మ ముహూర్తంలో అన్నది నియమం. అది ఆలయ ముఖం బట్టి కాదు. పడమర ముఖం పూజగదిలో పగలు పన్నెండు గంటలకైనా పూజ చేయవచ్చు అనేది లేదు.
 
మనిషి మేలుకొలుపు అన్నది ప్రధానం. మేలుకొలుపు అనేది భౌతిక శరీరం నిద్రలేవడం అనేదానిని సూచించేది కాదు భ్రమల నేత్రం మూసుకుని జ్ఞాననేత్రం తెరుచుకోవాలని సూచిస్తుంది. అద్భుత ప్రతిభ ఎక్కడో కొండకోనల్లో, పాతాళంలో పాతుకుని ఉండదు. 
 
మన పాంచభౌతిక శరీరంలోనే నిక్షిప్తమై ఉంటుంది. ప్రకృతిలోని బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రసారమయ్యే నిగూఢ శక్తి విన్యాసంతో మన మేధ మహాన్నత స్థితిని అందుకుంటుంది. ఆ వేళ మనిషిని మేలు కొలుపుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-02-2019 మంగళవారం దినఫలాలు - వార్తా సంస్థల్లోని వారికి ఊహించని..