నేటి తరుణంలో ఇంటి కట్టడాలు ఎక్కువైపోతున్నాయి. కానీ, ఆ ఇళ్ళను వాస్తు ప్రకారం నిర్మించనంటున్నారు. దీని కారణంగా ఆ కుటుంబ సభ్యులు పలురకాల దోషాలు, ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందుకు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇక కొందరికి ఇంటికి ఈశాన్యం గేటుకు ఎదురుగా రోడ్డు వస్తుంది. ఉత్తరంలో కొంత స్థలం ఉంది.. దానిని ఇంట్లోకి కలుపుకోచ్చా.. అనే సదేహం చాలామందిలో ఉంటుంది. అందుకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పమంటున్నారు.. అలాంటి వారి కోసం..
తూర్పు ఉత్తర స్థలాలు కలుపుకోవడం తప్పుకాదు. కానీ ఉన్న గృహానికి వీధిచూపు వచ్చినప్పుడు చుట్టు పక్కల స్థలాలు కలుపుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. మీకు వచ్చే ఎదురురోడ్డు అది ఈశాన్యం వీధిచూపు అయితే ఎంతో గొప్పగా ఉంటుంది. ఉత్తరం ఖాళీ ఇంటి ఆవరణలో కలుపుకున్నా కూడా ఆ వీధిచూపు ఉచ్ఛమైన భాగంలోకే వస్తే ఇబ్బంది ఉండదు.
కానీ ఉత్తరం స్థలం పెరిగేకొద్దీ దక్షిణం తగ్గిపోవడంతో ఎదురురోడ్డు ఇంటికి వీధిపోటు అవుతుంది. అది చాలా దోషం. కనుక మీరు లెక్క చూసుకుని ఆలోచించాలంటున్నారు పండితులు. ఉన్న ఇంటికి ఉన్న వీధి మంచిదిగా ఉన్నప్పుడు ఖాళీ స్థలాన్ని కలుపుకోకపోవడమే మంచిది.