Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ కన్నుమూత!!

ఠాగూర్
ఆదివారం, 11 ఆగస్టు 2024 (10:10 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ కన్నుమూశారు. చాలాకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఉన్న మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. 95 ఏళ్ల వయసున్న ఆయన గత రెండు వారాలుగా చికిత్స పొందారని తెలిపారు. 
 
నట్వర్ సింగ్ అంత్యక్రియలను ఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం నట్వర్ సింగ్ కొడుకు హాస్పిటల్ వద్ద ఉన్నారని, మిగతా కుటుంబ సభ్యులు కూడా స్వస్థలం నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలిపారు. కొంతకాలంగా నట్వర్ సింగ్ ఆరోగ్యం బాగాలేదని, శనివారం అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని వివరించారు. అంత్యక్రియలు ఇవాళే జరగనున్నాయి. 
 
కాగా నట్వర్ సింగ్ 1929లో రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జన్మించారు. మాజీ కాంగ్రెస్ ఎంపీ అయిన కె.నట్వర్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వంలో 2004-05 కాలంలో భారత విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు  పాకిస్థాన్ రాయబారిగా, 1966-1971 వరకు మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కార్యాలయంలో కూడా పనిచేశారు. ఇక 1984లో ఆయనను పద్మభూషణ్ వరించింది. కె.నట్వర్ సింగ్ అనేక పుస్తకాలను కూడా రచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments