Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్‌లో నాసికరకం ఆహారపదార్థాలు (Video)

Advertiesment
food checking

వరుణ్

, బుధవారం, 10 జులై 2024 (16:43 IST)
పలువురు హీరోలు, క్రికెటర్లు ఏదో ఒక సైడ్ బిజినెస్‌లు చేస్తుంటారు. అనేక ప్రముఖులు ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఒకరు. ఈయన హైదరాబాద్ నగరంలో "వివాహ భోజనంబు" అనే పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అందులో నాసికరకం ఆహార పదార్థాలు ఉన్నట్టు గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రెస్టారెంట్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పాడైన బియ్యం, నాసిర‌క‌పు ఆహార ప‌దార్థాలను అధికారులు గుర్తించారు. 
 
హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ 'వివాహ భోజనంబు' రెస్టారెంట్‌కు చెందిన సికింద్రాబాద్ బ్రాంచ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. పాడైపోయిన బియ్యం, నాసిర‌క‌పు ఆహార ప‌దార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. హోటల్లో 2022 నాటికే గడువు ముగిసిన 25 కిలోల చిట్టిముత్యాల రైస్ బ్యాగ్, సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బరి, కిచెన్ ఆవరణ శుభ్రంగా లేకపోవటాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో హోటల్‌‍పై అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ : పోలీసులకు ఆధారాలు సమర్పించిన ప్రియురాలు లావణ్య!!