Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవీన్ చంద్ర "ఇన్స్‌పెక్టర్ రిషి" వెబ్ సిరీస్ ట్రైలర్

Advertiesment
navin chandra - kajal

వరుణ్

, ఆదివారం, 24 మార్చి 2024 (15:04 IST)
నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ "ఇన్స్‌పెక్టర్ రిషి". సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్‌పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. అమోజాన్ తమిళ్ ఒరిజినల్‌గా "ఇన్స్‌పెక్టర్ రిషి" ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతోంది. క్వీన్ కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర "సత్యాభామ" అనే సినిమాలో పెయిర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్‌లో "ఇన్స్‌పెక్టర్ రిషి" వెబ్ సిరీస్ ట్రైలర్‌‌ను చూసి ఇంప్రెస్ అయిన కాజల్ అగర్వాల్ ట్రైలర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉందన్న కాజల్ అగర్వాల్... నవీన్ చంద్రతో పాటు వెబ్‌సిరీస్ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.
 
'తీన్ కాడు' అనే ప్రాంతంలోని అడవిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. జంతువుల కళేబరాలకు పట్టినట్లే మనుషుల శవాలకు పురుగుల గూడు అల్లుకుని ఉంటుంది. అడవిలో తిరిగే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలు చేస్తోందని ఊరి జనం చెబుతుంటారు. సీబీ సీఐడీకి కేసు ఇన్వెస్టిగేషన్ సీబీ సీఐడీకి చేరుతుంది. ఈ హత్యలకు కారణాలు తెలుసుకునేందుకు ఆ ఊరికి వస్తాడు కొత్త ఇన్స్‌పెక్టర్ రిషి. ఊరి జనం మాటలు నమ్మని రిషి సైంటిఫిక్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో రిషి అతని పోలీస్ టీమ్ షాక్ అయ్యే విషయాలు తెలుస్తుంటాయి. తీన్ కాడు ప్రాంత వరుస హత్యలకు  దెయ్యమే కారణమైతే అందుకు పరిష్కారాన్ని ఇన్స్‌పెక్టర్ రిషి ఎలా కనుక్కున్నాడు అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కంగువ' లాంటి గొప్ప సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా : హీరో సూర్య