Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ పోలీసులు కూడా రైలు ప్రయాణ టిక్కెట్లు కొనుగోలు చేయాల్సిందే : రైల్వే శాఖ స్పష్టత

Advertiesment
Railway Cops

వరుణ్

, సోమవారం, 5 ఆగస్టు 2024 (11:41 IST)
తమ విధుల్లో విధుల్లో భాగంగా రైళ్లలో ప్రయాణించే గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ), ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) సిబ్బంది విధిగా ప్రయాణ టిక్కెట్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైల్వే టిక్కెట్ కొనుగోలు చేయకుండా ఉండాలంటే వారివద్ద ఒక ట్రావెళ్ అథారిటీ నిర్ధారించే డ్యూటీ కార్డ్ పాస్ కలిగివుండాలని సూచించింది. గుర్తుంపు కార్డుతో ప్రయాణించి విధుల్లో ఉన్నానంటే చెల్లుబాటుకాదని తేల్చి చెప్పింది. 
 
విధుల్లో ఉన్న సమయంలో తాను రైలు నుంచి జారిపడ్డానని, ఒక కాలును కోల్పోయినందున పరిహారం చెల్లించాలంటూ ఓ కానిస్టేబుల్ దాఖలు చేసిన పిటిషనన్ను ‘రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్' కొట్టివేసింది. అతడి వద్ద ట్రావెల్ అథారిటీ లేదా రైలు టికెట్ లేకపోవడంతో పరిహారం పొందలేడని స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖకు అహ్మదాబాద్ బెంచ్ స్పష్టం చేసింది.
 
కాగా రాజేశ్ బగుల్ అనే జీఆర్పీ కానిస్టేబుల్ ప్రమాదం జరిగిన రోజున తాను అధికారిక విధుల్లో ఉన్నానని, కాబట్టి వడ్డీతో సహా మొత్తం రూ.8 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. నవంబర్ 13, 2019న డ్యూటీ కోసం సూరత్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని చెప్పాడు. సూరత్ నుంచి తిరిగి సూరత్ - జామ్ నగర్ ఇంటర్ సిటీ రైలులో బరూచ్‌కి వెళ్తున్న సమయంలో పాలేజ్ స్టేషన్ దాటాక పడిపోయానని, ఎడమ కాలుకు తీవ్రమైన గాయాలయ్యాయని, కాలుని మోకాలి పైకి వరకు తొలగించాల్సి వచ్చిందని వివరించాడు.
 
అయితే రాజేశ్ వాదనలను నిరూపించే డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు లేవని రైల్వే వాదించింది. తాను దిగాలనుకున్న స్టేషన్‌ను దాటిన తర్వాత రైలు దిగేందుకు ప్రయత్నిస్తుండగా అతడు జారిపడ్డాడని రైల్వే పేర్కొంది. వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యుడు (జుడీషియల్) వినయ్ గోయెల్.. రాజేశ్ అధికారిక ప్రయాణం చేసినట్టుగా నిరూపించడానికి సరైన ప్రయాణ ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఆధారాలు అందించడంలో రాజేశ్ విఫలమవడంతో పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొన్నారు. చెల్లుబాటు అయ్యే ట్రావెల్ అథారిటీ లేనప్పుడు పిటిషనర్‌ని ప్యాసింజర్ గుర్తించలేదని జులై 30న స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పలువురు గవర్నర్లు తీరు వివాదాస్పదం : సుప్రంకోర్టు జడ్జి విమర్శలు!!