దేశంలో వివిధ సంస్థల్లో పని చేసే పాత్రికేయులకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు వార్తలు రాసినా, ప్రసారం చేసినా... జర్నలిస్టు అక్రిడిటేషన్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్
దేశంలో వివిధ సంస్థల్లో పని చేసే పాత్రికేయులకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు వార్తలు రాసినా, ప్రసారం చేసినా... జర్నలిస్టు అక్రిడిటేషన్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
తప్పుడు వార్తలు రాసిన లేదా ప్రసారం చేసినట్లు తేలితే... తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టు గుర్తింపును నోటీసు ఇచ్చి ఆరునెలల పాటు రద్దు చేస్తారు. మళ్లీ రెండో సారి కూడా తప్పుడు వార్తలు రాస్తే మరో సంవత్సరం పాటు అక్రిడిటేషన్‌ను రద్దు చేస్తారు.
ఇలా మూడోసారి కూడా తప్పుడు వార్తలు రాసినా, ప్రసారం చేసిన అలాంటి విలేకరుల అక్రిడిటేషన్ (గుర్తింపు)ను శాశ్వతంగా రద్దు చేయాలని సర్కారు నిర్ణయించింది.
తప్పుడు వార్తలపై ఫిర్యాదులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ మీడియా ఫిర్యాదులను న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్‌కు పంపించాలని సర్కారు నిర్ణయించింది. ఫిర్యాదులను పీసీఐ, ఎన్బీఏలు పరిశీలించి 15 రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడించాలని కేంద్రం కోరింది.