Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశిష్ట సేవా జర్నలిస్టులకు ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డులు

మీడియా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకుగాను ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డు 2017 పలువురుకి ప్రదానం చేశారు.

Advertiesment
విశిష్ట సేవా జర్నలిస్టులకు ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డులు
, మంగళవారం, 5 డిశెంబరు 2017 (15:49 IST)
మీడియా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకుగాను ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డు 2017 పలువురుకి ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనెల ఒకటో తేదీన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
webdunia
 
ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మొహ్మద్ ఇబ్రీమ్ అల్ ఖహ్‌తాని హాజరుకాగా, ముల్క్ హోల్డింగ్స్ ఛైర్మన్ నవాజ్ షాజీ వుల్ ముల్క్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అలాగే, ఫోనెక్స్ ఇంటర్నేషనల్ గ్రూపు ఆఫ్ కంపెనీస్ సీఈఓ సామి సయ్యద్, మార్క్ టెక్నాలజీస్ సీఈవో సురేష్ సి పిళ్లైలు కూడా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
webdunia
 
ఇందులోభాగంగా, ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును టీ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఖాజా ఖయ్యూమ్ అన్వర్‌కు అందజేశారు.
webdunia
 
అలాగే, ఇండియన్ టెలివిజన్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్‌ అనిల్ వాన్వారికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు, ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అవార్డును మాజీ ఆర్ట్ ఎడిటర్, విన్నింగ్ మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్ ఎల్ఎల్పీ మేనేజింగ్ పార్ట్‌నర్ రత్నోత్తమ సెంగుప్తకు అందజేశారు.
webdunia
 
సోషల్ వెల్ఫేర్ విభాగంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును సన్మార్గ్ చీఫ్ సబ్ ఎడిటర్ కమలేష్ పాండేకు ఇచ్చారు. అలాగే, ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డులను నాలుగు విభాగాల్లో అందజేశారు. ఈ అవార్డులను పలువురు పేరొందిన జర్నలిస్టులు అందుకున్నారు.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య రహస్యం తెలిస్తే షాకే...