Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రాక్టికల్స్ పేరుతో వైద్య విద్యార్థినులకు లైంగిక వేధింపులు

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్య కాలోజీలే విద్యాభ్యాసం చేసే వైద్య విద్యార్థినులు లైంగికవేధింపులకు గురయ్యారు. ఈ ఆస్పత్రిలో పని చేసే ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఒక అటెండర్‌ వీరిపట్ల అసభ్యంగా ప్రవ

ప్రాక్టికల్స్ పేరుతో వైద్య విద్యార్థినులకు లైంగిక వేధింపులు
, ఆదివారం, 3 డిశెంబరు 2017 (16:11 IST)
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్య కాలోజీలే విద్యాభ్యాసం చేసే వైద్య విద్యార్థినులు లైంగికవేధింపులకు గురయ్యారు. ఈ ఆస్పత్రిలో పని చేసే ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఒక అటెండర్‌ వీరిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరావను పరిశీలిస్తే, ఈ ఆస్పత్రిలో శిక్షణ పొందుతున్న వైద్య విద్యార్థినులకు ప్రయోగపరీక్షల్లో మార్కుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వీరు కొన్నేళ్లుగా లైంగికంగా లొంగదీసుకుంటున్నారు. మాట వినకపోతే వేధిస్తున్నారు. ఈ యేడాది ఆగస్టులో కొందరు వైద్య విద్యార్థినులు ఈ విషయాన్ని ఆసుపత్రి పర్యవేక్షకుడి దృష్టికి తీసుకెళ్లగా, దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ వేశారు. 
 
ఈ కమిటీ విచారణలో ఈ వేధింపులు నిజమని తేలింది. అయినప్పటికీ వారి వక్రబుద్ధి మారలేదు. ఈ నేపథ్యంలో మరోమారు ఇదే తరహా వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి వెళ్ళింది. ఆయన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఉత్తరమండలం డీసీపీ సుమతి, బేగంపేట్‌ మహిళా ఠాణా ఇన్‌స్పెక్టర్‌ జానకమ్మ నేతృత్వంలోని పోలీసుల బృందం వేధింపులకు పాల్పడిన మహ్మద్‌ అక్రమ్‌(47), ఆంథోని(53), మధుబాబు(30) ల్యాబ్‌ టెక్నీషియన్లుగా, దుర్గాదాస్‌(36) ల్యాబ్‌ అటెండర్‌ను అరెస్టు చేశారు. వీరి విచారణలో 14మంది విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. దీంతో నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆలి పాలిట కట్టుకున్నవాడే కాలయముడు..