Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ రాష్ట్రంలో పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్‌ప్రెస్..

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (09:37 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. సూర్య నగరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే, ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ చనిపోలేదు. కానీ పది మందికి గాయాలయ్యాయి. ప్రాణనష్టం లేకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంద్రా టెర్మినల్ నుంచి జోధ్‌పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ జోధ్‌పూర్ డివిజన్‌ పరిధిలోని రాజ్‌కియావస్ - బోమద్ర స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న నార్త్ వెస్టర్న్ రైల్వే అధికారులు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి.. సహాయక సిబ్బందిని అప్రమత్తం చేసి, పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో వెళ్లే ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 
 
మార్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికో రైలులో భారీ కుదుపు లాంటి శబ్ధం వచ్చిందని, ఆ తర్వాత రెండు మూడు నిమిషాలకే రైలు ఆగిపోయిందని ఆ రైలులో ప్రయాణం చేసిన ఓ ప్రయాణికుడు చెప్పాడు. కిందికి దిగి చూస్తే మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని వివరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments