Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాహుల్ గాంధీ జోడో యాత్ర.. దీన్నే అహంకారంలో నిగ్రహాన్ని కోల్పోవడం అంటారు (video)

Advertiesment
rahul gandhi
, బుధవారం, 21 డిశెంబరు 2022 (16:41 IST)
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కానీ కరోనా మూడో వేవ్ కారణంగా ఈ యాత్రను వాయిదా వేసుకోవాలని.. లేకుంటే కరోనా నియమాలు పాటించాలని కేంద్రం రాహుల్ గాంధీకి సూచించిన నేపథ్యంలో.. రాజస్థాన్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుపట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాహుల్ గాంధీ తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ కాంగ్రెస్ కార్యకర్త చేతిని పక్కకు నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో గాంధీ ఆగ్రహంతో కార్మికుడి చేయిని పక్కకు నెట్టేసినట్లు కనిపిస్తోంది. 
 
బుధవారం ఉదయం రాజస్థాన్ నుంచి హర్యానాలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాహుల్ ఆగ్రహం చూసి తోటి నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు.  ఇంతలో, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఈ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసి, "దీన్నే అహంకారంలో నిగ్రహాన్ని కోల్పోవడం అంటారు!" ఇంకా  #BharatJodaYatraని హ్యాష్‌ట్యాగ్‌లో ఉంచారు
 
మరో పార్టీ నాయకుడు, రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, లక్ష్మీకాంత్ భరద్వాజ్ కూడా వీడియోను ట్వీట్ చేసి, "సోదరుడికి ఏమైంది" అని ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నర్సుల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు నోటిఫికేషన్