ఉదయ్‌పూర్‌లోని టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు రద్దయ్యాయి. టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ కావడంతో ఈ పరీక్షలు రద్దు అయ్యాయి. టీచర్స్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ 2022 కోసం రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల షెడ్యూల్ జారీ చేసింది.
ఈ క్రమంలో శనివారం జరగాల్సిన జీకే పరీక్ష పేపర్ లీకైంది. ఈ పరీక్షలు రాసేందుకు జలోర్ నుంచి 50మంది అభ్యర్థులు బస్సులో శుక్రవారం అర్థరాత్రి బస్సులో ప్రయాణించారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తి చేసిన జవాబు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మేరకు గ్యాంగ్ లీడర్, అతని అనుచరులతో పాటు అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.