Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి చెంప ఛెళ్లుమనిపించిన పోలీస్... ఉద్యోగం ఊడింది.. ఎక్కడ!!

Webdunia
బుధవారం, 29 జులై 2020 (08:40 IST)
పోలీసు ఉద్యోగం ఉంది కదా అని విర్రవీగాడో అధికారి. నడిరోడ్డుపై ఓ యువతిని చెంప పగలగొట్టాడు. అక్కడితో ఆగకుండా ఆమె జుట్టుపట్టుకొని గుంజాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. అలా విషయం సీఎం హేమంత్ సోరెన్ వరకూ వెళ్లింది. ఈ వీడియో చూసిన ఆయన చాలా సీరియస్ అయ్యారు. 
 
డీజీపీ ఎమ్‌వీ రావుకు ట్యాగ్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. 'ఇలాంటి నీచమైన, అనుచితమైన ప్రవర్తనను అస్సలు భరించకూడదు' అని ట్వీట్ చేశారు. వీడియోలోని పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై వెంటనే స్పందించిన డీజీపీ సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసి, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.
 
నిజానికి కొంతమంది పోలీసులు విధుల్లో ఉన్నపుడు, చేతిలో అధికారం ఉందని కిరాతకంగా రెచ్చిపోతుంటారు. జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్ గంజ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, రోడ్డుపై బందోబస్తులో ఉన్న ఓ పోలీసు, ఆ దారిలో వచ్చిన ఓ యువతిని ఎందుకు వచ్చావని ప్రశ్నించి, ఆపై చెంపమీద ఒక్కటిచ్చాడు. 
 
అంతేకాదు... జుట్టు పట్టుకుని లాగాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన స్మార్ట్ ఫోన్‌లో బంధించగా, అది సోషల్ మీడియాకు ఎక్కింది. సదరు పోలీసు తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇది చివరకు ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ దృష్టికి వెళ్లడంతో అధికారిపై సస్పెండ్ వేటుపడింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments