Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"కిక్" మూవీ నటుడు శ్యామ్ అరెస్టు.. ఇంట్లో ఆ పని చేస్తుంటే...

webdunia
మంగళవారం, 28 జులై 2020 (11:38 IST)
టాలీవుడ్ హీరో రవితేజ నటించిన చిత్రం "కిక్". ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటుడు శ్యామ్ నటించాడు. అలాగే, 'రేసుగుర్రం' చిత్రంలో హీరో అల్లు అర్జున్‌కు అన్నగా, ఓ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ రెండు చిత్రాల ద్వారా అతనికి మంచి గుర్తింపు వచ్చాయి. అలాగే, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించాడు. అలాంటి శ్యామ్‌ను ఇపుడు చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక నుంగంబాక్కంలోని ప్రముఖ కాలేజీకి ఎదురుగా ఉన్న బహుళ అంతస్తు భవనంలో శ్యామ్ నివసిస్తున్నాడు. తన నివాసంలోనే ఎలాంటి అనుమతి లేకుండా ఫోకర్ క్లబ్‌ను నడుపుతున్నట్టు పోలీసులు కనుగొన్నారు. ఈ క్లబ్ ద్వారా గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో శ్యామ్‌ను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

కిక్ నటుడు శ్యామ్ అరెస్ట్.. పోలీస్‌గా నటించాడు.. గ్యాంబ్లింగ్‌కి పాల్పడ్డాడు..