Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికల్లో పోటీచేసినంత మాత్రానా నేను పేదను కాకుండా పోతానా? సోనూ మా దేవుడు..

ఎన్నికల్లో పోటీచేసినంత మాత్రానా నేను పేదను కాకుండా పోతానా? సోనూ మా దేవుడు..
, సోమవారం, 27 జులై 2020 (19:26 IST)
చిత్తూరు జిల్లాకు చెందిన పేద రైతు నాగేశ్వరరావుకు బాలీవుడ్ నటుడు ట్రాక్టర్ అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగేశ్వరరావు దంపతులు.. ఆయన కుమార్తెలు సెలెబ్రిటీలుగా మారిపోయారు. వారి కుటుంబం గురించి అందరూ తెలుసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన పేద రైతు నాగేశ్వరరావు కష్టాలను సోషల్ మీడియాలో గమనించి సోనాలికా ట్రాక్టర్ పంపారు నటుడు సోనూసూద్. 
 
చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్ రాజపురం రైతు నాగేశ్వరరావు టమోటా రైతు సాగుచేసేందుకు ప్రయత్నించడం, ఆయనకు ఎద్దులు లేకపోవడంతో తన ఇద్దరు కూతుళ్ల సాయంతో దుక్కిదున్నడం, భార్య విత్తనాలు చల్లడం వీడియోలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను చూసి సోనూ ట్రాక్టర్ పంపగా, కుమార్తెల చదువుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్నారు. 
 
చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మహల్‌రాజుపల్లెకు చెందిన నాగేశ్వరరావు ఉపాధి నిమిత్తం మదనపల్లెలో టీ అంగడి నడుపుతున్నారు.ఈయన కుమార్తెలు వెన్నెల ఇంటర్‌, చందన పదో తరగతి పాసయ్యారు. నాగేశ్వరరావు కరోనా లాక్‌డౌన్‌తో కుటుంబాన్ని తీసుకుని స్వగ్రామానికి వచ్చేశారు. ఆయనకు రెండెకరాల వర్షాధార భూమి ఉంది. 
 
ఈసారి అదునుకు వర్షం పడ్డా వేరుశనగ విత్తేందుకు కూలీలు, నాగళ్లు దొరక్క కుదరలేదు. కంది, టమోటా వేయాలని భావించారు. కాడిని చెరో పక్క పట్టుకుని లాగారు. తండ్రి మేడిపట్టగా... తల్లి విత్తనాలు చల్లింది. తమ కష్టం నలుగురికీ తెలియాలని, మరో నలుగురికి స్ఫూర్తిగా నిలవాలని ఈ దృశ్యాలను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
webdunia
sonu sood
 
ఈ సందర్భంగా రైతు నాగేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ.. తన బిడ్డల కాయకష్టం ఇంత మందిని కదిలిస్తుందని ఊహించలేదని నాగేశ్వరరావు దంపతులు భావోద్వేగానికి లోనయ్యారు. వారిని ఉన్నత చదువులు చదివిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.

సోనూసూద్‌కు తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే మనసున్న సోనూ సూద్‌ చల్లగా ఉండాలని కోరుకున్నారు.అంతా బాగానే వుంది కానీ సోనూసూద్ తమకు ట్రాక్టర్ ఇస్తున్నారని తెలిసి తాహశీల్దార్, ఆర్డీవోలు తమ ఇంటికి వచ్చారని తమ వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు.
 
ఎంపీడీవో కూడా వచ్చి వివరాలు అడిగారని, అయితే తాను గతంలో పోటీచేసిన విషయం అడిగారన్నారు. ఎంపీడీవో తీరు తనను బాధించిందన్నారు. లోక్ సత్తా తరఫున తాను పనిచేసే పార్థసారథి తరఫున తాను డమ్మీగా నామినేషన్ వేశానని, ఎన్నికల్లో ప్రచారం చేశానన్నారు నాగేశ్వరరావు.
webdunia
sonu sood


ఎన్నికల్లో పోటీచేసినంత మాత్రాన తాను పేదను కాకుండా పోతానా అని ఆయన ఆవేదన చెందారు. కాగా సోనూసూద్ ఇచ్చిన ట్రాక్టర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లా రైతు సోనూసూద్‌ను నిలువునా మోసం చేశాడా? ఎలాగో చెప్పిన అధికారులు