Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు పుడతాడని నమ్మించిన భూతవైద్యుడు.. కుమార్తెను బలిచ్చిన తండ్రి!!

Webdunia
ఆదివారం, 15 నవంబరు 2020 (09:13 IST)
మన దేశంతో పాటు ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికీ.. మన దేశంలో మూఢనమ్మకాలు ఇంకా తొలగిపోలేదు. గ్రామీణ ప్రాంతాలు, నగరాలని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ మూఢ నమ్మకాలు బలంగా నాటుకునివున్నాయి. దీన్ని అనేక మంది భూతవైద్యులు క్యాచ్ చేసుకుని చెలామణిలో ఉన్నారు. 
 
ప్రజల అజ్ఞానం, మంత్రగాళ్ల దురాశ.. వెరసి అనేక దారుణాలకు దారితీస్తున్నాయి. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఓ భూతవైద్యుడు చెప్పిన మాటలు నమ్మి ఓ తండ్రి తన కుమార్తెను బలిచ్చాడు. అదీకూడా కొడుకు పుడతాడన్న మూఢ నమ్మకంతో ఈ పని చేశాడు. కానీ, చివరకు ఆ ఇంటి విషాదం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 
 
రాంచీకి చెందిన సుమన్ నాగస్యా ఓ రోజుకూలీ. అతడికి ఆరేళ్ల కుమార్తె ఉంది. కొడుకులు లేరని నిత్యం అసంతృప్తికి గురవుతుండేవాడు. ఈ క్రమంలో సుమన్ నాగస్యా ఓ భూతవైద్యుడిని కలిశాడు. తనకు కొడుకులు లేరన్న విషయం చెప్పి అతడిని సలహా అడిగాడు. అయితే ఆ మంత్రగాడు, కొడుకు పుట్టాలంటే కూతుర్ని బలివ్వాలని చెప్పాడు.
 
అది నిజమేనని నమ్మిన సుమన్ మరేమీ ఆలోచించకుండా ఉన్మాదంతో కూతుర్ని తల నరికి బలిచ్చాడు. ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు కిరాతక తండ్రి సుమన్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న భూతవైద్యుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments