Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మగబిడ్డ కోసం కుమార్తె తల నరకాడు.. మాంత్రికుడు చెప్పాడని..?

Advertiesment
మగబిడ్డ కోసం కుమార్తె తల నరకాడు.. మాంత్రికుడు చెప్పాడని..?
, శనివారం, 14 నవంబరు 2020 (14:10 IST)
ఆధునికత పెరిగినా మనిషిలో మార్పు అంతంత మాత్రంగా వుంది. ఇంకా పలు ప్రాంతాల్లోని ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. విచక్షణ కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఒళ్లు గగురుపొడిచే సంఘటన చోటుచేసుకుంది. ఓ మంత్రగాడి మాటలు నమ్మిన వ్యక్తి కన్న కూతురిని అత్యంత దారుణంగా హతమార్చాడు. 
 
లాహోర్‌దాగాలోని పేష్రార్‌కు చెందిన సుమన్‌ నగాసియా (26) దినసరి కూలీ. అతడికి ఆరేళ్ల కుమార్తె ఉంది. కుమారుడు కావాలనే కోరికతో ఉన్న సుమన్‌కు ఓ మంత్రగాడి గురించి తెలిసింది. దీంతో అతడిని సంప్రదించాడు. 
 
అయితే కూతురిని బలిస్తే నీకు మగబిడ్డ కలుగుతాడని ఆ మాంత్రికుడు చెప్పడంతో విచక్షణ కోల్పోయిన సుమన్‌ తన కుమార్తెను చంపేందుకు వెనకాడలేదు. అత్యంత దారుణంగా తల నరికి హత్య చేశాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మాంత్రికుడి కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామజన్మభూమి అయోధ్యలో దీపావళి.. దీపాల వరుసతో గిన్నిస్ రికార్డ్