Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో మరోమారు డ్రోన్ల కలకలం - 6 రౌండ్ల కాల్పులు

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (12:31 IST)
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర సరిహద్దుల్లో మరోమారు డ్రోన్ల సంచారం కనిపించింది. ఇది కలకలం సృష్టించింది. శుక్రవారం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ పాకిస్థాన్‌ డ్రోను మన దేశ భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. దీన్ని పసిగట్టిన భారత సరిహద్దు భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఆ డ్రోన్‌ వెనుదిరిగినట్లు అధికారులు వెల్లడించారు.
 
శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో జమ్మూ శివారులోని అర్నియా సెక్టార్‌లో ఓ చిన్న క్వాడ్‌కాప్టర్‌ అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు ప్రయత్నించింది. ఈ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే ఆరుసార్లు కాల్పులు జరిపారు. 
 
దీంతో ఆ డ్రోన్‌ పాకిస్థాన్‌ వైపు వెళ్లిపోయిందని బీఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాంతంలో నిఘా కోసం డ్రోన్‌ పంపి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. జమ్ములో అనుమానిత డ్రోన్లు సంచరించడం ఈ వారంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
 
కాగా, గత ఆదివారం తెల్లవారుజామున జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లోకి ప్రవేశించిన రెండు డ్రోన్లు బాంబులు జారవిడిచాయి. ఈ ఘటనలో భవనం పైకప్పు ధ్వంసమైంది. ఆ తర్వాత మరుసటి రోజే జమ్ములోని మరో సైనిక స్థావరంపై డ్రోన్‌ దాడిని సైన్యం భగ్నం చేసింది. 
 
కాగా, పాక్ ప్రేరేపిత ఉగ్రమాకలే ఈ డ్రోన్ దాడులకు పాల్పడుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో శాంతి స్థాపనకు కేంద్రం చేపట్టిన చర్యలను భగ్నం చేసేందుకు ఇలాంటి ఎత్తుగడలకు ఉగ్రమూకలు పూనుకుంటున్నట్టు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments