మేలో దేశ వ్యాప్తంగా ప్రారంభిస్తామన్న వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్దేశించుకున్న అంచనాలను కేంద్ర ప్రభుత్వం అందుకోలేక పోయిందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
ఈ విషయమై శుక్రవారం తన అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ జూలై వచ్చింది, వ్యాక్సీన్ ఇంకా రాలేదు అని హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వ్యాక్సీన్ ఎక్కడ అనే హ్యాష్‌ట్యాగ్‌ను రాహుల్ జత చేశారు.
మోదీ ప్రభుత్వం జూలై నాటికి దేశ వ్యాప్తంగా 12 కోట్ల మందికి పూర్తి స్థాయిలో టీకా వేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఐదు కోట్ల మందికి పై చిలుకు మాత్రమే పూర్తి అయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మాటలు వట్టి నీటిమూటలయ్యాయని జూలై నాటికి లక్ష్యంగా పెట్టుకున్న వ్యాక్సినేషన్ పూర్తి చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని రాహుల్ విమర్శలు గుప్పించారు.