దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై ఒకటి నుంచి కొత్త నిబందనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబందనలను ప్రతి ఖాతాదారుడు తెలుసుకోవాలి అని స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ ను కోరింది.
ఎటిఎమ్ నుంచి నగదు విత్ డ్రా, బ్రాంచీ నుంచి నగదు విత్ డ్రా, చెక్ బుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడి) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది.