Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

జులై 8న వైఎస్సార్ తెలంగాణ పార్టీ

Advertiesment
YSR Telangana Party
, సోమవారం, 7 జూన్ 2021 (12:26 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజైన జులై 8న వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ అయింది. షర్మిల తన కొత్త పార్టీని ‘వైఎస్సార్ టీపీ’గా రిజిస్ట్రేషన్ చేయించారు. పార్టీ పేరుపై తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని వైఎస్ సతీమణి విజయలక్ష్మి రాసిన లేఖను వైఎస్సార్ టీపీ ఈసీకి సమర్పించింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను తెలంగాణలో మళ్ళీ తీసుకురావడం కోసం, ఆయన ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా, వైఎస్సార్ అందించిన సంక్షేమం.. ప్రతి ఇంటికి మళ్ళీ చేరేలా ‘వైఎస్సార్ తెలంగాణ’ పార్టీ పెట్టాలనుకుందని మీ అందరికి తెలిసిందే.
 
వైఎస్సార్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనులన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వద్ద పూరైనవి. పార్టీ పేరుపై వైఎస్ విజయమ్మగారికి ఎటువంటి అభ్యంతరం లేదని వారు ఇచ్చిన లేఖను కూడా పార్టీ పేరుకు మద్దతుగా ఎలక్షన్ కమిషన్‌కు ఇవ్వడం జరిగింది.

ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా.. ‘వైఎస్సార్ తెలంగాణ’ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వారి అఫిషియల్ వెబ్‌సైట్‌లో పార్టీ పేరు పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏప్రిల్ 30వ తేదీనే ఎలెక్షన్ కమిషన్ తెలిపింది. ఇప్పటి వరకూ ఎటువంటి అభ్యంతరాలు రాలేదంటే అనుమతుల ప్రాసెస్ పూర్తయినది అనుకుంటున్నాం.

ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా నుంచి అఫిషియల్‌గా అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీకు  ప్రకటిస్తాం. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరు వైఎస్ విజయమ్మ గారి సమ్మతితోటి .. వారి ఆశీస్సుల తోటే జరిగింది కాబట్టి ఇతరులకు అభ్యంతరం ఉంటుంది అని మేము అనుకోవడం లేదు.

రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు జులై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను.. కార్యక్రమాలను మేము ఇప్పటికే ప్రారంభించాం’’ అని రాజగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాఫ్రికా మహిళ శరీరంలో 32 రకాల మ్యుటేషన్స్‌