Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముళ్లై పెరియార్ డ్యామ్‌ను కూల్చేయమన్నాం.. తమిళనాడు పట్టించుకోలేదు..

కేరళ రాష్ట్రం వరదలో మునిగిపోవడంతో యావత్తు దేశం షాక్ తింది. ఇంకా కేరళకు ఇతర రాష్ట్రాలు చేయూతనిచ్చాయి. ఇందులో తమిళనాడు కూడా వుంది. అయితే కేరళ మాత్రం తమ రాష్ట్రంలో సంభవించిన వరదలకు తమిళనాడే కారణమని ఆరోపణ

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (10:56 IST)
కేరళ రాష్ట్రం వరదలో మునిగిపోవడంతో యావత్తు దేశం షాక్ తింది. ఇంకా కేరళకు ఇతర రాష్ట్రాలు చేయూతనిచ్చాయి. ఇందులో తమిళనాడు కూడా వుంది. అయితే కేరళ మాత్రం తమ రాష్ట్రంలో సంభవించిన వరదలకు తమిళనాడే కారణమని ఆరోపణలు చేస్తోంది.


తమ రాష్ట్రంలో వరదలపై కేరళ ప్రభుత్వం తమిళనాడును నిందించింది. తమ రాష్ట్రంలో ఉన్న ముళ్లై పెరియార్ ప్రాజెక్ట్ నుంచి నీటిని అకస్మాత్తుగా విడుదల చేయడం వల్ల తమ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. 
 
వరదలను నివారించడానికి ముళ్లై పెరియార్ డ్యామ్‌లో నీటి నిల్వ స్థాయిని 139 అడుగుల వరకు ఉంచాలని తాము విజ్ఞప్తి చేసినా తమిళనాడు పట్టించుకోలేదని తెలిపింది. ముళ్లై పెరియార్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా వచ్చి ఇడుక్కి డ్యామ్‌లో చేరిందని, ఈ నెల 15న ఇడుక్కి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో కేరళ అల్లకల్లోలంగా మారిందని కేరళ ప్రధాన కార్యదర్శి చెప్పారు. 
 
తమిళనాడు ప్రజలకు నీటిని అందించే ముళ్లైపెరియార్ ప్రాజెక్టును కేరళలో 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ డ్యామ్ నిర్వహణ మొత్తం తమిళనాడే చూసుకుంటోంది. కానీ డ్యామ్ పాతది కావడంతో కూల్చివేయాలని కొత్త డ్యామ్ నిర్మించాలని.. చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నామని కేరళ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

ఈ డ్యామ్‌లో నీటిశాతం పెరగడంతోనే ఇడుక్కికి నీరు చేరాయని.. దీంతో భారీ వరదలు సంభవించాయని కేరళ ఆరోపించింది. ఫలితంగా 373 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments