Webdunia - Bharat's app for daily news and videos

Install App

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (14:47 IST)
నింగిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పాడెక్స్ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ పోస్టు పెట్టింది. తాజాగా వీటిని 15 మీటర్ల సమీపానికి తీసుకొచ్చి.. ఆపై 3 మీటర్లకు ఈ దూరాన్ని తగ్గించింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి రెండు ఉపగ్రహాలను సురక్షితమైన దూరానికి జరిపినట్లు పేర్కొంది. ఈ డేటాను విశ్లేషించిన తర్వాత డాకింగ్ ప్రక్రియ చేపడతామని ఇస్రో ప్రకటించింది. 
 
అంతకుముందు స్పాడెక్స్ ఉపగ్రహాల చిత్రాలను కూడా ఎక్స్ పోస్టు చేసింది. ఆదివారం తెల్లవారు జామున 3.10 సమయంలో తొలుత ఈ ఉపగ్రహాలను 105 మీటర్ల దగ్గరికి చేర్చారు. అనంతరం అవి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాయని ఇస్రో తెలిపింది. నింగిలో డాకింగ్ కోసం జంట స్పాడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. అవి 'హోల్డ్' దశలో ఉన్నాయి. 
 
ఎసీఎక్స్01 (ఛేజర్), ఎసీఎక్స్ 02 (టార్గెట్) అనే ఈ రెండు ఉపగ్రహాలను గత నెల 30న పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా 475 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 7, 9 తేదీల్లో వీటిని అనుసంధానం (డాకింగ్) చేసేందుకు నిర్ణయించినప్పటికీ.. వివిధ కారణాల వల్ల అది వాయిదాపడింది. ఆ ప్రక్రియ ఇప్పుడు జోరుగా జరుగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments