పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (11:33 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించాలని భావించిన పీఎస్ఎల్వీ సీ-61 రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆదివారం ఉదయం 5.59 గంటలకు చేపట్టిన ప్రయోగాన్ని పూర్తిగా విశ్లేషించిన తర్వాత ఫలితాన్ని వెల్లడించనున్నారు. మూడో దశ తర్వాత రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని, దీంతో ప్రయోగం పూర్తికాలేదని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. 
 
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి 101వ మిషన్ పీఎస్ఎల్వీ సీ-61ను ఆదివారం ఉదయం నింగిలోకి పంపించాలని భావించింది. అయితే, చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్‌‍ను పరిశీలిస్తున్నారు. 
 
ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ61 మిషన్‌ను ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న షార్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను నింగిలోకి పంపించారు. ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తికాలేదని, మూడో దశ తర్వాత రాకెట్‌లో సమస్య వచ్చిందని, అన్నీ విశ్లేషించాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments