Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

Advertiesment
rain

ఠాగూర్

, ఆదివారం, 18 మే 2025 (10:06 IST)
నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతారణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. వాస్తవానికి ఇవి ఈ నెల 22వ తేదీన అండమాన్‌ను, 26న శ్రీలంకను తాకొచ్చని భావించగా అందుకు పది రోజుల ముందుగానే శ్రీలంకలోని ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక అండమాన్‌లలో విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ నాటికి తాకే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ వెల్లడించింది. 
 
అంతేగాక రాబోయే రోజుల్లో మరింత వేగంగా కదలడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. మరోవైపు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది. 
 
పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట... 
 
పాకిస్థాన్‌కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరోమారు దేశంలో ఉగ్రవాద దాడి జరిగితే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మహిళల నుదుట సిందూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్‌ సిందూర్‌తో ధీటుగా బదులిచ్చామన్నారు. భారత్‌పై తమ ఆటలు సాగవని పాకిస్థాన్ గ్రహించాలని, మని దేశంపై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందన్నారు. 
 
ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సైనికులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. మోడీ రూపంలో దేశానికి సమర్థవంతమైన నాయకుడు లభించారని, ఉగ్రవాదం అంతు చూడాలని ప్రధాని సంకల్పించారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 
 
మన రక్షణ దళాలు.. ఉగ్రవాదులు ఈ దేశంపై కన్నెత్తి చూడకుండా పోరాడాయి. మన సైనికులను చూసి ఏపీనే కాదు.. దేశమంతా గర్విస్తోందన్నారు. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ జెండా చూడగానే మనందరిలో ఉత్సాహం, ఉద్వేగం దేశ భక్తి కలుగుతుంది. ఆ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వారే కావడం మనందరికీ గర్వకారణం అని అన్నారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య ఉగ్రవాదం. మనం ఎపుడూ ఇతర దేశాలపై యుద్ధాలకు వెళ్లం. మన జోలికి వస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పితీరుతామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి