ఉగ్రవాదంపై భారత్ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఉగ్రవాదంపై తమది జీరో టాలరెన్స్ వైఖరని చాటి చెప్పడంతో పాటు ఆపరేషన్ సిందూర్‌పై విదేశాలలో ప్రచారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంపీల బృందాన్ని ఏర్పాటుచేసింది. ఇందుకోసం ఏడు అఖిలపక్ష ప్రతినిధుల జాబితాను ప్రకటించింది. మొత్తం 59 మంది ఎంపీల సభ్యులతో కూడిన ఈ బందాలు ఈ నెల 23వ తేదీ నుంచి 32 దేశాల్లో ప్యటించనున్నాయి.
ఏప్రిల్ 22వ తేదీన పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో దాడికి పాల్పడి 26 మందిని చంపేసిన విషయం తెల్సిందే. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్య చేపట్టింది. ఇందులోభాగంగా, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లలో ఉండే ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఉగ్రవాదంపై భారత్ యొక్త జీరో టాలరెన్స్ వైఖరిని, ఆపరేషన్ సిందూర్‌పై విదేశాలలలో ప్రచారం చేయడానికి వివిధ దేశాలకు ప్రయాణించే ఏడు అఖిలక్ష ప్రతినిదుల జాబితాను కేంద్రం శనివారం విడుదల చేసింది. 59 మంది సభ్యులతో కూడిన ఈ బృందాలు మే 23వ తేదీ నుంచి 32 దేశాల్లో పర్యటిస్తాయి.
వీరిలో ఎన్డీయే నుంచి 31 మంది రాజకీయ నేతలు, ఇతర పార్టీలకు చెందిన 20 మంది ఎంపీలు ఉన్నారు. వారికి మాజీ దౌత్యవేత్తలు సహాయం చేయనున్నారు. ఈ ప్రతినిధుల బృందాలకు బీజేపీ ఎంపీలు బైజయంత్ జయ్ పాండా, రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, జూడీయూ నేత సంజయ్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ నేత సుప్రియా సూలే నేతృత్వం వహిస్తారు. వారు 32 దేశాలను, బెల్జియంలోని బ్రస్సెల్స్‌లోని ఈయూ ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు.