నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-50 నౌక.. 1410 కిలోలతో సీఎంఎస్‌-01ను కూడా మోసుకెళ్లింది..

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (16:18 IST)
PSLV C50
పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. సీఎంఎస్‌-01 కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ను నింగిలోకి ఇస్రో పంపింది. సీ-బ్యాండ్‌ సేవల విస్తరణకు సీఎంఎస్‌-01 దోహదపడనుంది.
 
శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి... PSLV సీ-50 రాకెట్‌ను ప్రయోగించారు. 25 గంటల కౌంట్‌డౌన్ తర్వాత మధ్యాహన్నం 3గంటల 41 నిమిషాలకు అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేసింది ఇస్రో. దీనికి సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ కూడా ముందే పూర్తయ్యాయి. ఈ శాటిలైట్‌ బరువు 1410 కిలోలు. 
 
అండమాన్‌, నికోబర్‌, లక్షద్వీప్‌లలో... ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవలను అందించనుంది. దేశంలో ఇకపై మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇది ఏడేళ్ల పాటు కక్షలో తిరుగుతూ ఉంటుంది. PSLV సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వ ప్రయోగం కాగా... షార్ నుంచి చేపడుతున్న 77వ మిషన్ ఇది.
 
నింగిలోకి నిప్పులు విరజిమ్ముతూ పీఎస్‌ఎల్‌వీ-సి50 వాహకనౌక దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 1,410 కిలోల బరువు గల కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ సీఎంఎస్‌-01ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. ఇస్రో చరిత్రలోనే సిఎంఎస్-01 42వ సమాచార ఉపగ్రహం. 1410 కిలోల ఈ సిఎంఎస్ - 01 శాటిలైట్ జీవిత కాలం ఏడేళ్లు. ఈ ప్రయోగం విజయమంతమైతే దేశంతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కి సమాచార వ్యవస్థ పూర్తిస్థాయిలో మెరుగు పడనుంది. 20.11 నిమిషాల్లోనే కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విడిచిపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments