కీచకుడిగా మారిన కానిస్టేబుల్.. ఇంటికి రమ్మని అలా చేసేవాడు..

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (16:10 IST)
కానిస్టేబుల్ కీచకుడిగా మారాడు. 13 ఏళ్ల బాలికపై కన్నేశాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలో విలే పార్లేకి చెందిన 28 ఏళ్ల కానిస్టేబుల్ ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్నారిపై కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారిని తన ఇంటికి రమ్మని బెదిరింపులకు దిగేవాడు. ఇలా ప్రతి రోజూ ఆ మైనర్ బాలికను వేధింపులకు గురి చేసేవాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. 
 
ఇలా రోజు జరుగుతున్న భయంతో ఆ మైనర్ బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు. కానీ, చుట్టు పక్కల ఉన్న వారు ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. ఈ విషయం నిజమని నిర్థారించుకున్న తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఆ కీచకుడి మీద ఫిర్యాదు చేశారు.
 
ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. ఇంకా ఆ కీచక కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అధికారం ఉందని ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చర్యలు తప్పవని ముంబై పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments