Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుమానించి తనిఖీ చేసిన ఖాకీలు ... లోపల దృశ్యం చూసి అవాక్కయ్యారు...

Advertiesment
అనుమానించి తనిఖీ చేసిన ఖాకీలు ... లోపల దృశ్యం చూసి అవాక్కయ్యారు...
, ఆదివారం, 23 ఆగస్టు 2020 (10:01 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో పోలీసులు విస్తుపోయే దృశ్యం చూసి విస్తుపోయారు. ఓ లాడ్జీలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో కొంతమంది పోలీసులు ఆ లాడ్జీని నిశితంగా తనిఖీచేశారు. కానీ, వారికి వ్యభిచారం చేస్తున్నట్టు ఎలాంటి ఆనవాళ్లు చిక్కలేదు. లాడ్జీ గదుల్లో ఉన్నవారు కూడా అలాంటి వారు కాదని నిర్ధారించుకున్నారు. 
 
కానీ, ఓ గదిలో రెండు అతిపెద్ద నిలువుటద్దాలు వారికంటపడ్డాయి. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. ఇక్కడ ఇంత పెద్ద అద్దాలు ఎందుకు ఉన్నాయన్న విషయంపై పోలీసులకు సందేహం వచ్చింది. ఆ వెంటనే ఓ పోలీసు వెళ్లి వాటిని కదిలించగా, అసలు గుట్టు బహిర్గతమైంది. ఆ అద్దం వెనుక ఓ పెద్ద గదే ఉంది. అక్కడ 22 యేళ్ల అమ్మాయితో పాటు ఇద్దరు విటులు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ గదిలోనే వ్యభిచార దందా సాగుతున్నట్టు పోలీసులు నిర్ధారించి, హోటల్ మేనేజరు, సిబ్బందిని అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరులోని శరణ్యా లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలకు వెళ్లారు. అన్ని గదులను వెతికినా అనుమానించతగ్గ వారు ఎవరూ కనిపించలేదు. ఓ గదిలో మాత్రం వారికి రెండు పెద్ద పెద్ద అద్దాలు కనిపించాయి. 
 
ఆ లాడ్జిలో రెండు పెద్ద అద్దాలు ఉండటం, అవి ఎదురెదురుగా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. ఓ అద్దాన్ని కదిలించగా దాని వెనుక రహస్యంగా ఏర్పాటు చేసిన ఓ గదే ఉంది. దానిలో బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి ఉంది. ఇద్దరు వ్యక్తులు ఆమెను తీసుకుని వచ్చి, దందా జరిపిస్తున్నారని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాఫియా డాన్ దావూద్ కరాచీలోనే ఉన్నాడు : పాకిస్థాన్