Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృత జయలలిత కుమార్తెనా కాదా?: ఫిబ్రవరి 1న కోర్టులో విచారణ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ అమృత తెరపైకి వచ్చింది. గతంలో తాను జయలలిత కుమార్తెనని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు ఆ తర్వాత మ

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (15:09 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ అమృత తెరపైకి వచ్చింది. గతంలో తాను జయలలిత కుమార్తెనని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు ఆ తర్వాత మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అమృత కేసు ఈ నెల 2న విచారణకు రానుంది. 
 
ఈ కేసులో డీఎన్ఏ ఒక్కటే కావడంతో అమృత హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)ని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి సీసీఎంబీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సీసీఎంబీ కోర్టు ఆదేశాల మేరకే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ కేసులో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలంటే.. అమ్మ అస్థికల డీఎన్ఏను సేకరించాలి. 
 
కానీ ఆ పని జరిగేలా కనిపించట్లేదు. దీంతో జయలలిత తోబుట్టువుల నుంచి రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. డీఎన్ఏ పరీక్ష చేసి అమృతను జయలలిత కుమార్తెనా లేదా అనేది పెద్ద విషయం కాదని కూడా నిపుణులు చెప్తున్నారు. మరి ఆ పరీక్షలపై కోర్టు ఎలాంటి తీర్మానం తీసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments