Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2016, ఆగస్టు 11 తేదీన అమ్మకు రాసిన లేఖ దొరికింది..

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు రాసిన ఓ రహస్య లేఖ ప్రస్తుతం బయటపడింది. తాజాగా దొరికిన లేఖ ఆగస్టు 11, 2016న రాసింది. ఐటీ ప్రిన్సిపల్ డైరెక్టర్ నుంచి సీఎం జయలలిత, డీజీపీలను ఉద్దేశిస్తూ ఈ లేఖ వచ్చింది. గుట్క

2016, ఆగస్టు 11 తేదీన అమ్మకు రాసిన లేఖ దొరికింది..
, శనివారం, 13 జనవరి 2018 (12:20 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు రాసిన ఓ రహస్య లేఖ ప్రస్తుతం బయటపడింది. తాజాగా దొరికిన లేఖ ఆగస్టు 11, 2016న రాసింది. ఐటీ ప్రిన్సిపల్ డైరెక్టర్ నుంచి సీఎం జయలలిత, డీజీపీలను ఉద్దేశిస్తూ ఈ లేఖ వచ్చింది. గుట్కా స్కామ్‌ గురించి ఈ లేఖలో సమాచారం వుంది.

ఈ స్కామ్‌లో రాష్ట్రమంత్రి, ఉన్నతాధికారులు, పోలీసులకు సంబంధమున్నట్టు తేలింది. ప్రభుత్వంతో సంబంధాలున్న రాజకీయ పార్టీలకు కూడా ముడుపులు అందాయని ఆరోపిస్తూ, వెంటనే స్పందించాలని, చర్యలు తీసుకోవాలని జయలలితకు ఐటీ ప్రిన్సిపల్ డైరక్టర్ సిఫార్సు చేశారు. 
 
గత ఏడాది చిన్నమ్మ గదిలో జరిపిన సోదాల్లో ఈ లేఖ లభ్యమైంది. ఇందులో గుట్కా స్కామ్‌కు సంబంధించిన వివరాలున్నట్లు మద్రాసు హైకోర్టుకు ఐటీ ప్రిన్సిపల్ డైరక్టర్ సుశీ బాబు వర్గాల ద్వారా తెలిసింది. గుట్కా స్కామ్‌పై సీబీఐ దర్యాప్తును కోరుతూ డీఎంకే శాసనసభ్యుడు అంబజగన్ పిటిషన్ వేయగా, దీనిపై విచారించిన కోర్టు, వేదనిలయంలోని శశికళ గదులను సోదాలు చేసేందుకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. గత ఏడాది ఐటీ అధికారులు నిర్వహించివ సోదాల్లో చిన్నమ్మతో పాటు ఆమె కుటుంబీకుల ఆస్తుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 187 ప్రదేశాల్లో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఇప్పటిదాకా రూ.4,500 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. 80 నకిలీ కంపెనీలను గుర్తించారు. నకిలీ కంపెనీల పేరుతో 1800 ఎకరాల భూమిని కూడా వీరు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. 
 
పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ. 150 కోట్లతో తమిళనాడులో ఏకంగా 1200 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు అధికారులు నిర్ధారించారు. ఇదే సమయంలో శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు చెందిన 200 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. మరోవైపు, పోయెస్ గార్డెన్ లోని హార్డ్ డిస్క్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్‌టెల్ వినియోగదారులకు కొత్త ఆఫర్.. అమేజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ